మళ్లీ ఫ్లైఓవర్ వివాదం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మళ్లీ ఫ్లైఓవర్ వివాదం..!
– పాత తాండూరులో బ్రిడ్జిపై అభ్యంతరం
– నేతలు, అధికారులతో చర్చోప చర్చలు
– స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో నిర్మిస్తున్న ఫైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి నిర్మాణం కొందరికి ఇష్టంగా, మరికొందరకి కష్టంగా మారడమే ఇందుకు కారణం. దాదాపు రూ. 74 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టారు. పనుల ప్రారంభం నుంచి బ్రిడ్జి నిర్మాణంపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఫ్లైఓవర్ బ్రిడ్జికి అమోదం చేస్తే, ఇంకొందరు అండర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. తాజాగా ఈ వివాదం మళ్లీ చోటు చేసుకుంది. స్థలాలు, భూములు, నివాసాలు కోల్పోతున్న వారితో పాటు స్థానికుల అభిప్రాయం మేరకు కౌన్సిలర్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిపివేయాలని వినతిపత్రాలు అందించారని ఆరోపించారు. దీంతో వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం స్థానికులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, నేతలతో అభిప్రాయాలను సేకరించారు.

ఇందులో కొందరు ఫ్లైఒవర్ బ్రిడ్జి నిర్మాణం పోడవును, వెడల్పులను కుదించాలని అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల స్థానికులకు ఇబ్బందులు. అవస్థలు కలగకుండా ఏర్పాట్లను చేయాలని కోరారు. దీనిపై మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ ఫై ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపే అవకాశం లేదన్నారు. భూములు, స్థలాలు, నివాసాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం పరిహారంను ఖరారు చేసిందని తెలిపారు. అయినా కూడా నిర్మాణ పనుల్లో వివాదం జరుగుతుందన్నారు.

పాత తాండూరులో ప్రజల నుంచి అభిప్రాయాల నివేధికను జిల్లా కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ అబ్దుల్ రవూఫ్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బొంబీనా, వరాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నయూం ఖాన్, పాత తాండూరు పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

నాపరాతి గనులను ముంచెత్తిన వరధ..!