రైలు ఢీకొని వ్యక్తి మృతి

క్రైం తాండూరు వికారాబాద్

రైలు ఢీకొని వ్యక్తి మృతి
– లభించని మృతుని వివరాలు
– తాండూరు రైల్వే స్టేషన్‌ పరిధిలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు రైల్వే పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 50-55 ఏండ్లు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రుక్మాపూర్ – తాండూరు రైల్వే స్టేషన్ మార్గంలోని కోకట్ రైల్వే బ్రిడ్జి సమీపంలో కిలో మీటర్ రాయి 74/23 వద్ద మృతి చెంది కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మరణించినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతుని వద్ద ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతుని ఒంటిపై తెల్లని బనియన్, గోధుమ రంగు నెక్కరుతో పాటు నీలి రంగు డబ్బాలు కలిగిన లుంగీ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా కుడి చేతికి వెండి కడియం ఉన్నట్లు తెలిపారు. వికారాబాద్ స్టేషన్ మాస్టర్ పిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్ మల్లయ్య తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే సెల్: 9553195100, 7013184318లకు సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!