వేర్ల పొడిలో ఆరోగ్యం..!
– శరీరానికి మెండుగా పోషకాలు
– లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్టరు
దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి లభించే మొక్కల వేర్ల ద్వారా కూడా మనిషి ఆరోగ్య వంతుడు ఆవుతాడు. ఆయుర్వేధంలో ఉన్న ఎన్నో మొక్కల వేర్ల నుంచి తయారు చేసిన ఔషదాలతో అనారోగ్యాలను దూరం చేసుకుంటున్నారు. అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒకటి. అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సుగంధి పాల వేర్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ సుగంధి పాల వేర్లు మనకు ఆయుర్వేద షాపుల్లో విరివిగా లాభిస్తాయి. వీటిలో నల్ల సుగంధి, ఎర్ర సుగంధి, దేశీయ సుగంధి ఇలా అనేక రకాలు ఉంటాయి. ఈ సుగంధి వేర్లతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం.

సుగంధి పాల వేర్ల కషాయాన్ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయాన్ని తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఈ సుగంధి పాల మొక్క వేరును కడిగి నేరుగా నోట్లో పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. సుగంధి పాల మొక్క వేరు కషాయాన్ని తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు కాంతివంతంగా కూడా తయారవుతంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. అధిక వేడితో బాధపడేవారు ఈ కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అధిక వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం.
తయారు చేసుకోవడం ఇలా..
సుగంధ వేర్లతో కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం 4 లేదా 5 గ్రాముల సుగంధ వేర్ల బెరడు పొడి, 4 మిరియాలను, 2 యాలకులను, ఒక చిన్న అల్లం ముక్కను, 10 పుదీనా ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసిఅందులో సుగంధ వేర్ల పొడి, అల్లం, మిరియాలు, యాలకులు వేసి నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత వడకట్టి అందులో పుదీనా ఆకులు, తేనె వేసి కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇదికూడా చదవండి…

