ఉత్సహాంగా సంక్రాంతి సంబరాలు

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా సంక్రాంతి సంబరాలు
– మహిళలకు ముగ్గుల పోటీలు
– హాజరైన ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి
– విజేతలకు బహుమతులు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు మైమరించాయి. తాండూరు ఆర్బీఓఎల్ ఎండి సరళా శ్రీనివాస్ రెడ్డి సన్నిహిత మిత్రులు, ఆత్మీయ సభ్యులు ఈ సంబరాలు జరుపుకున్నారు.

ఆదివారం పట్టణంలోని నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాలలో జరిగిన వేడుకలకు సరళా శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు ఉత్సహాంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. రంగు రంగులతో వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.

ఈ పోటీలో అందమైన ముగ్గులకు బహుమతులు అందజేశారు. పోటీలో గెలిచిన విజేతలకు సరళా శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సరళారెడ్డి సన్నిహితులు, మిత్రులు, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పట్టణాభివృద్ధి నిధులకు పచ్చజెండా..!