మెసేజ్‌లు వస్తే స్పందించొద్దు..!

క్రైం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మెసేజ్‌లు వస్తే స్పందించొద్దు..!
– తెరిచి చూశారంటే.. అంతే సంగతులు
– విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఈ మద్య కాలంలో సైబర్ మోసకాళ్లను వినియోగదారులకు విభిన్న రీతుల్లో మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ‘మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు… వెంటనే కట్టండి.. లేదంటే కరెంట్‌ కట్‌ చేస్తున్నాం’ అంటూ మీ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలాంటి మేసేజ్‌లను నమ్మరాదని, అలాంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు. కరెంటు బిల్లు కట్టలేదంటూ డిస్కం ఉద్యోగులు ఫోన్‌లో ఎవరినీ బ్యాంకు ఖాతా, ఆధార్‌, పాన్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు తదితర వివరాలను అడగరని విద్యుత్‌ శాఖ అధికారులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. పైగా మెసేజ్‌లలో డిస్కం ఎలాంటి లింకులు పెట్టదని స్పష్టం చేశారు.

అయితే కొందరు సైబర్ నేరగాళ్లు లింకులను పంపిస్తున్నారని తెలిపారు. వాటిని పొరపాటున కూడా తెరిచిచూడవద్దని, ఆ మెసేజ్‌లు వచ్చిన సెల్‌నంబర్లకు ఫోన్లు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల సొమ్ము కొట్టేయడానికి సైబర్‌ నేరస్థులు రోజుకో పంథా అవలంబిస్తున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌ నారాయణగూడలోని ఓ వ్యక్తి ఇలా రూ.6 లక్షలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అలాంటి మెసేజ్‌లకు స్పందించొద్దని వినియోగదారులకు దక్షిణ డిస్కం సీఎండీ సూచించారు.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!