తాండూరు కమీషనర్‌కు షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు కమీషనర్‌కు షాక్..!
– బదిలీతో పాటు మెమో జారీ
– కొత్త కమీషనర్‌గా యాదగిరి
– రాత్రే వెలువడిన ఉత్తర్వులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్‌ విక్రమ్ సింహా రెడ్డికి ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై బదిలి వేటుతో పాటు ఓ మెమోను కూడా జారీ చేసినట్లు తెలిసింది.
kvcs
బదిలీ ఉత్తర్వులు అయితే బుధవారం రాత్రే వెలువడ్డాయి. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఏసీబీ అధికారుల దాడుల ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. ఈ క్రమంలో మున్సిపల్ కమీషనర్‌పై బదిలీ వేటు వేయడం, అదే క్రమంలో మెమో జారీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారుల దాడుల సమయంలో మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో లేకపోవడం అనే అంశంపై కమీషనర్‌కు మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కమీషనర్‌ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.

దీంతో కమీషనర్‌ హెడ్‌ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. మరోవైపు కమీషనర్‌కు ఎక్కడికి బదిలీ చేస్తారనేది సస్పెన్స్‌లో ఉంది. ఎక్కువ శాతం అయన మళ్లీ జహీరాబాద్‌ మున్సిపల్‌కు వెళతారని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో తాండూరు మున్సిపల్ కమీషనర్‌గా గ్రేడ్-3 కమీషనర్‌గా ఉన్న యాదగిరిని నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపు, లేదా ఎల్లుండి ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అధికార యంత్రాంగాలలో చర్చనీయాంశంగా మారాయి.

ఇదికూడా చదవండి…

బాప్‌రే.. బల్దియా..!