నరేందర్ రెడ్డికి ఊరట..!
– మూడు ఎఫ్‌ఐఆర్‌లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ నాయకులు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. వికారబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసులు నరేందర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఘటనలో నరేందర్ రెడ్డిపై మూడు కేసులను నమోదు చేశారు. దీనిపై నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. కోర్టు తీర్పును రిజర్వ్ చేసి నేడు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు నరేందర్ రెడ్డిపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డికి ఊరట కలిగింది.
ఇదికూడా చదవండి…

