పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ రణదావా
– ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
దర్శిని బ్యూరో: పంజార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ రణదావాను ఎంపిక చేసింది. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. పంబాజ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సీఎంగా సుఖ్‌జిందర్ రణదావాను పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. కెప్టెన్ అమరీందర్‌సింగ్ స్థానంలో సుఖ్‌జిందర్‌ను ఎన్నుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా సుఖ్‌జిందర్ రణదావాకు పేరు ఉంది. కెప్టన్ అమరీందర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుఖ్‌జిందర్‌కు ఉంది. అయితే.. పంజాబ్ సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించాయి. పీసీసీ చీఫ్ సిద్ధూతో పాటు మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్, మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్టల్, ప్రతాప్ సింగ్ భజ్వా, రణ్వీత్ బిట్టు, మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ నేత అంబికా సోనీ పేరు తెరపైకొచ్చినా.. తాను సీఎంగా ఉండలేనని ప్రకటించారు. సీఎం ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన అధిష్టానం దూతలు ఎమ్మెల్యేలతో సమావేశమైన తరువాత సుఖ్‌జిందర్ రణదావా పేరును ప్రతిపాదించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. సీఎంగా సిద్ధూను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా సిద్ధూను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.
