మహేందర్ రెడ్డికి మంత్రి పదవి..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మహేందర్ రెడ్డికి మంత్రి పదవి..!
– ఆరోగ్యశాఖ మంత్రి పదవి ఇచ్చే చాన్స్..?
– గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం
– ఎల్లుండి నియామకంకు ఏర్పాట్లు
– మరింత ఆసక్తికరంగా పాలిటిక్స్‌
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వెనుకడుగు వేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సర్కారు కేబినెట్‌లో మహేందర్ రెడ్డికి త్వరలోనే మంత్రి పదవిని కట్టబెట్టబోతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవిని అందించే ఆలోచనలో అధిష్టానం యోచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎమ్మల్సీ మహేందర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మద్య వర్గపోరు ఏర్పడింది. మొదటి నుంచి తాండూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మహేందర్ రెడ్డి చాలా సందర్భాలలో ప్రకటించారు.

అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన సమయం సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనకు టిక్కెట్టు రాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని వదులుకోవడం ఇష్టం లేక ఆయనతో బుజ్జగింపులు ప్రారంభించింది. ఎంపీ రంజిత్‌ రెడ్డి ద్వారా రాయబారం చేసినా అంగీకరించలేదు. కొన్ని రోజుల క్రితమే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. దీంతో మహేందర్ రెడ్డి వెనుకడుగు వేయడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే టిక్కెట్ వరించింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెల రాజేందర్ రాష్ట్ర ఆరోగ్య శాఖగా పనిచేశారు. కొన్ని రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీ వీడడంతో ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేపడుతున్నారు. ప్రస్తుతం మహేందర్‌ రెడ్డికి వచ్చిన ఆఫర్ లో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి దస్త్రాల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం జరిగిందని, లేదంటే రేపు సాయంత్రానికి మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టె ప్రక్రియ పూర్తి అయ్యిఉండేదని బీఆర్ఎస్ వర్గాల సమాచారం.

తాండూరు నేతలకు ఆహ్వానం..
మరోవైపు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే సమాచారం తాండూరులోని ఎమ్మెల్సీ వర్గం నేతలకు, ఎమ్మెల్యే వర్గం నేతలకు ముందే తెలుసనే ప్రచారం సాగుతోంది. సోమవారం ప్రగతి భవన్‌లో టిక్కెట్ కేటాయింపుల పర్వం పూర్తి అయిన తరువాత ఈ ప్రచారం మరింత వేగంగా జరిగింది. మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన వర్గం నేతలను ఆహ్వానించినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!