‘ఉర్సు’కు ముర్షద్‌ దర్గా ముస్తాబు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘ఉర్సు’కు ముర్షద్‌ దర్గా ముస్తాబు..!
– ఎల్లుండి నుంచి ఉర్సేషరీఫ్‌ ఉత్సవాలు
– భారీగా పాల్గొవాలని నిర్వహకులు విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని ముర్షద్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ముర్షద్‌దర్గాలో ఎల్లుండి నుంచి అంటే ఈనెల 29వ తేదినుంచి 77ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్‌గని పాష ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీమ్ సాహెబ్ ఖిబ్లా చిప్తే ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 77వ ఉర్సే షరీఫ్, హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 17 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. రేపు మంగళవారం జల్సాతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎల్లుండి బుధవారం రాత్రి 7 గంటలకు గంధము, గురువారం దీపోత్సవం, రాత్రి ఖవ్వాలి, శుక్రవారం నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురన్‌పాక్‌, రాత్రి 8గంటలకు పాతేహఖ్వాని వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సేషరీఫ్‌ను జయప్రదం చేయాలని మత పెద్దలు సయ్యద్ అబ్దుల్ గఫూర్ పాష, సయ్యద్ అబ్దుల్ ఖుర్షిద్ పాష, సయ్యద్ అబ్దుల్ అన్వర్ పాష, సయ్యద్ అబ్దుల్ జావిద్ పాషలు కోరారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!