
స్కూళ్లకు ఆఫ్ డే..!
– వికారాబాద్ జిల్లా డీఈఓ ఆదేశాలు
– మధ్యాహ్నం నుండి బడులకు సెలవు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని పాఠశాలలకు ఆఫ్ డే ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్ నియోజకవర్గాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది.

ఈ వర్షాల కారణంగా జిల్లాలోని విద్యా సంస్థలకు శనివారం మధ్యాహ్నం నుంచి ఒంటిపూట సెలవు ప్రకటించారు. దీంతో శనివారం రెండు పూటలు కొనసాగాల్సిన పాఠశాలలు మధ్యాహ్నానికి బంద్ కానున్నాయి. . శనివారం ఉదయం నుంచి వర్షం కురస్తున్నా విద్యార్థులు బడులకు హాజరయ్యారు. కాసేపటి తరువాత డీఈఓ ఒంటిపూట బడిపై ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పాఠశాలలకు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపించారు. దీంతో మధ్యాహ్నం నుంచి బడులకు సెలవు ఇచ్చారు.

ఇదికూడా చదవండి…

