భాష్యం విజయ భావుటా..!
– ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల సత్తా
– టాప్ మార్కులు సాధించిన స్టూడెంట్స్
– అభినందించిన కరస్పాండెంట్, యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తాండూరు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ భావుటా ఎగురవేశారు. గురువారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచారు. పదో తరగతిలో వెనుకబాటులో ఉన్న విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా మార్కులు సాధించి కాలేజీ టాపర్లుగా నిలిచారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఆర్.కీర్తన 464/470(SSC 8.0), ఈ. శ్రావ్య 463/470(SSC 9.3), ఆర్.వర్ష 462/470(SSC 8.5), కె.రక్షిత 461/470(SSC 7.8), బి.ఆర్తి 461/470(SSC 9.0). Bi.P.C లో పి.నందిని 425/440(SSC 8.5), అస్మా తంకీన్ 420/440(SSC 8.5), C.E.Cలో చేతన్ కుమార్ 461/500(SSC 7.7), ఆస్థా ఉపాధ్యాయ 458/500(SSC 8.2), MECలో అర్షిత 434/500(SSC 8.0), ఈ. నందిని 430/500(SSC 8.2) సాధించారు.

అదేవిధంగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో MPCలో పటేల్ భాగ్యశ్రీ 986/1000, ఎం. ప్రశాంతి 979/1000, Bi.P.Cలో సాయి స్ఫూర్తి 968/1000, హరీష్ 958/1000, మాధురి 957/1000, CECలో టి. సౌమ్య 967/1000, దీపక్ 921/1000లు అద్భుత ఫలితాలు సాధించి కాలేజ్ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా కరెస్పాండంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడంతో పాటు అన్నీ గ్రూపులల్లో సుమారు 80శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అనురాధ రమేష్, ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డి,అధ్యాపకులు వెంకట్ రెడ్డి, మల్లికార్జున్,గోవర్ధన్,నరేష్,సుప్రజా, మధురిమ,పూర్ణిమ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

