ఉద్దండుల ఆగమనం..!
– ఎల్లుండి తాండూరుకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
– 10 వేల మందితో భారీ ర్యాలీకి ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల ఆగమనానికి ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 3 ఎల్లుండి ఆదివారం ఉదయం తాండూరుకు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గనుల, భూగర్బ, సమాచార మంత్రిగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టడం, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా టిక్కెట్టు ఖరారు అయిన తరువాత తొలిసారి తాండూరుకు వచ్చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రపోషించిన చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి తాండూరుకు వస్తున్నారు. మొదటి సారి తాండూరుకు వస్తున్న నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తాండూరు రైల్వే స్టేషన్ చౌరస్తాలో సన్మాన సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున ఈ ర్యాలీ, సభలకు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

