రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
దర్శిని ప్రతినిధి: రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అలాగే, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరో 112 ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా చిట్యాలలో అత్యధికంగా 9.15 సెం.మీల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా బుగ్గారంలో 8.73, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 8.28, సంగారెడ్డి జిల్లా హత్నూరాలో 7.50 సెం.మీల వర్షం పడింది. అదేవిధంగా వచ్చే రెండు రోజులు భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
