కట్ట మైసమ్మ సేవలో మంత్రి, ఎమ్మెల్యే
– పాతకుంట ఆలయంలో ప్రత్యేక పూజలు
– పాల్గొన్న చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మను రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు దర్శించుకున్నారు. గత రెండు రోజులుగా ఆలయంలో శ్రీ కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం కట్ట మైసమ్మ ఆలయంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు శ్రీ కట్ట మైసమ్మ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ ఆలయ కమిటీ సభ్యులు మంత్రి మహేందర్ రేడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి సన్మానం చేశారు.

మరోవైపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మల్లికార్జున స్వామి, గౌరయ్య స్వామీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, సిద్దిరాల శ్రీనివాస్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..

