మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు
– మ‌హిళ మోర్చ జిల్లా అధ్య‌క్షురాలు సాహు శ్రీ‌ల‌త‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో మహిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని బీజేపీ వికారాబాద్ జిల్లా మ‌హిళ మోర్చ అధ్య‌క్షురాలు, తాండూరు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ సాహు శ్రీ‌ల‌త అన్నారు. న‌ల్గొండ జిల్లా మూషంప‌ల్లిలో మ‌హిళ‌ను అత్యాచారం చేసి హ‌త్య‌చేసిన ఘట‌న‌ను ఆమె గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో ఖండించారు. సైదాబాద్‌లోని ఆరేళ్ల చిన్నారి ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం
ధారుణ‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర వైఫ‌ల్యాల కార‌ణంగానే దాడులు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. మ‌హిళ‌ల‌పై, చిన్నారుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు, హ‌త్య‌ల‌కు ప్ర‌భుత్వ‌మే నైతిక బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ఇప్ప‌టికైనా మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుక‌రావాల‌ని డిమాండ్ చేశారు.