రెండు తలల గేదె దూడ
– బషీరాబాద్ మండలం జీవన్గిలో వింత
తాండూరు, దర్శిని ప్రతినిధి: సృష్టిలో అప్పడుప్పుడు వింతలు జరగడం సర్వసాధారణమే. అలాంటి వింత సంఘటన శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం జీవన్గీలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట గేదే ప్రసవించింది. మామూలుగా గేదే ఒక తల ఉన్న దూడను ప్రసవించడం సహజం. కాని రైతు ఇంట ప్రసవించిన దూడకు రెండు తలలు ఉండడం విశేషమైన వింత. ఈ వింతను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉండగా జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి వింత జననాలు జరుగుతాయని పశువైద్యాధికారులు పేర్కొంటున్నారు.
