అన్నదానంలో ఆత్మసంతృప్తి
– సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్
– శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నదానంలో ఆత్మసంతృప్తి సిద్దిస్తుందని తాండూరు శ్రీసాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ అన్నారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా శంకర్ యాదవ్ శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే భక్తులకు అన్నదానం చేశారు. బుధవారం తాండూరు నుంచి పాదయాత్రగా వెళ్లిన భక్తులకు కోడంగల్ సమీపంలోని ఉడిమేశ్వరం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్, సతీమణీ చంద్రకళ, కుమారుడు అభినవ్ సాయి, తండ్రి హనుమయ్యలతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి యేడాది శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. దైవకృపతో భక్తులకు సేవ చేయడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. భక్తులకు అన్నదానం చేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, న్యాయవాది పాశం రవికుమార్, గోపాల్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, శంకరన్న యువసేన సంఘం సభ్యులు, స్నేహితులు, బందుమిత్రులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

