విద్యారంగానికి సర్కారు పెద్దపీట
– సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
– రూ.25 కోట్లతో తాండూరులో నర్సింగ్ కాలేజీ
– తాండూరులో పీఆర్టీయూటీఎస్ భవనం ఏర్పాటుకు కృషి
-సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగం అభివృద్ధికి సర్కారు పెద్దపీట వేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్లో పీఆర్టీయూటీఎస్ వికారాబాద్ జిల్లా యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తాండూరు ప్రాంతంలో ఉన్నత విద్యకోసం వికారాబాద్ వెళ్లాల్సి వచే ్పదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీలు మంజూరు అయ్యాయని గుర్తుచేశారు. అదేవిధంగా తాండూరులో రూ.25 కోట్లతో నర్సింగ్ కాలేజీ మంజూరుకు కృషి చేయడం జరిగిందన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
తన తల్లి కూడా టీచర్ కావడంతో ఉపాధ్యాయుల కష్టాలు తనకు తెలుసన్నారు. అమ్మ చేతుల మీదుగా ఎదిగినందుకు తనలో ఎథిక్స్, మోరల్స్ అలాగే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. త్వరలోనే తాండూరులో పీఆర్టీయూటీఎస్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో 25 ఏండ్ల సర్వీసు పూర్తి. చేసుకున్న దాదాపు 129 మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, కార్యదర్శి అమర్ నాథ్, గౌరవాధ్యక్షులు వెంకట్ రామిరెడ్డి, మాజీ అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యదర్శి పూల రవీందర్, పట్టణం, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ ప్రాంతాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

