బీసీల కల సాకారమైంది
– రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవనం
– భూమిపూజ చేసిన మంత్రి..ఎమ్మెల్యే
– ధన్యవాదాలు తెలిపిన బీసీ సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా తాండూరులో బీసీలకు సమీకృత(ఇంటిగ్రేటెడ్) భవన నిర్మాణం చేపట్టడంతో వారి కల సాకారమవుతోందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం రూ.2 కోట్ల వ్యయంతో బిసి సమీకృత భవన నిర్మాణంకు మంత్రి, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక భాగంలో బీసీ భవన్ నిర్మాణంకు 2 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో ఆధునిక హంగులతో బీసీ సమీకృత భవనంను నిర్మించాలని సంకల్పించారు. గత కొద్ది కాలంగా బీసీ సమీకృత భవనం కొరకు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. తాజాగా బిసి భవన్ కు భూమి పూజ చేసే కార్యక్రమంకు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కన్వీనర్ రాజ్ కుమార్ నేతృత్వంలో భారీ ఎత్తున తరలివచ్చి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం జరిగిన బీసీ భవన్ భూమిపూజ కార్యక్రమంలో బిసి సామాజిక వర్గాలకు చెందిన నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్మన్ దీపానర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ వీనా శ్రీనివాస్ చారీ, పార్టీ నేతలు కరణం పురుషోత్తంరావు, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారీ, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సంగీతా ఠాకూర్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా అధ్యక్షురాలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, పట్టణ అధ్యక్షురాలు జ్యోతి, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి..

