కాంగ్రెస్ తుఫానులో కారు కొట్టుకుపోవడం ఖాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ తుఫానులో కారు కొట్టుకుపోవడం ఖాయం
– 9 ఏండ్లుగా మోసపూరిత పాలనకు చరమగీతం తప్పదు
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరు మండలంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : దూసుకవస్తున్న కాంగ్రెస్ తుఫాన్లో కారు కొట్టుకుపోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు మండలం బెల్కటూర్, నారాయణపూర్, గోసూర్, వీర్ శెట్టిపల్లి, బిజ్జారం, బెల్కటూర్, చంద్రవంచ, చెన్‌గెష్‌పూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. బెల్కటూర్ గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. చంద్రవంచలో దర్గాలో మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాది సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మోసపూరిత పాలన చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన అందించడంలో బీఆర్ఎస్ సర్కారు విఫలం అయ్యిందన్నారు. దళితులకు, గిరిజనులు, మైనార్టీలను మభ్య పెడుతున్నారని అన్నారు. దళితబంధు, రైతుబంధు, గృహలక్ష్మీలో నిరుపేదలకు, అర్హులైన వారికి అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హాయాంలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. 9 ఏండ్లుగా మోసపూరిత పాలన చేస్తున్న ప్రజలు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వైపు ఉద్యమ కారులు, ప్రజలు చూస్తున్నారని అన్నారు.. కాంగ్రెస్ తుఫానులో కారు పార్టీ కొట్టుకపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కగా అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.

ముఖ్య నేతల చేరికలు
మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగిన ప్రచారంలో పలువురు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ తదితరుల సమక్షంలో ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, గౌతాపూర్ రాంచంద్రారెడ్డి(రాజు)ల సమక్షంలో ఈ చేరికలు జరగడం గమనార్హం. బెల్కటూర్‌లో ఉపసర్పంచ్ నాగరాజు, మల్లికార్జున్, పుల్లారెడ్డి, నారాయణ రెడ్డి, రసూల్, బాల్ రెడ్డి, గుండప్ప, బిజ్జరంలో ‘ మాజీ సర్పంచులు సాయిలు, బాలకృష్ణయ్య, ఉపసర్పంచ్ రమేష్, మాజీ ఉపసర్పంచ్ హన్మంతు, మల్లేశం, గోనూరులో మోనప్ప, వెంకటయ్య, శివప్ప, సతీష్, మల్లేశం, శివకుమార్, గౌతమ్, కిషోర్ గౌడ్, మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్, సత్యనారాయణ, వెంకటయ్య, వార్డు సభ్యులు ఉదయ్ భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కేశవ రెడ్డి, విజయ్ కుమార్, చంద్రవంచలో మాజీ ఎంపీటీసీ మాణిక్యమ్మ, విజయ్ కుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలతో పాటు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు కాంగ్రెస్ లో చేరారు. మనోహర్ రెడ్డి అందరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత