మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు
– ప్రయాణికులకు తప్పని తిప్పలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గమ్య స్థానాలు, వివిధ ప్రాంతాలకు చేరుకోవాలంటూ సామాన్యుడికి ఆర్టీసీ బస్సులు దిక్కు. ప్రతి రోజూ వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణం మద్యలో బస్సులు మొరాయిస్తే ఇబ్బందులు తప్పవు. సరిగ్గా తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సులు ఇలాంటి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. తాండూరు ఆర్టీసీ డీపోలో దాదాపు దాదాపు 94 బస్సులు ఉన్నాయి. వీటిలో 44 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. మిగతావి ఆర్టీసీకి చెందినవి. హైదరాబాద్, మహబూబ్ నగర్, శ్రీశైలం వంటి తదితర ప్రాంతాలకు బస్సులు సర్వీసులు ఇస్తున్నాయి. అయితే డిపోకు చెందిన బస్సుల కాలపరిమితి దగ్గర పడుతుండడంతో ప్రయాణ సమయాల్లో మొరాయిస్తున్నాయి.హైదారాబాద్‌కు వెళ్లే మార్గంలోనే ఈ సమస్యలు తలెత్తున్నాయి. మద్యలో బస్సులో ఎక్కిన ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా మెరుగైన బస్సులను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
