గ్రామస్తులకు అందుబాటులో ఉంటా
– అగ్గనూర్ గ్రామాభివృద్ధికి సహాకారం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
యాలాల, దర్శిని ప్రతినిధి: మండలంలోని అగ్గనూర్ గ్రామస్తులకు అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధికి సహాకారం అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అగ్గనూర్ గ్రామంలో ఇటీవల గొడవలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి రావడంతో మంగళవారం గ్రామ సర్పంచ్ భీమప్ప ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు.

సమావేశానికి ఉమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై గ్రామంలో జరిగిన గొడవపై చర్చించారు. అందరికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా గ్రామాభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని అన్నారు. అధికారులతో మాట్లాడి గ్రామ సమస్యను పరిష్కరించడం పట్ల గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ జి.సురేందర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ వేణుగోపాల్, జెక్కేపల్లి యాదిరెడ్డి, రాస్నం ఉపసర్పంచ్ జనార్దన్ రెడ్డి, బీజే యాదప్ప, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

