హస్తం ఆశలకు ఆగంకావొద్దు..!
– నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయం
– మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, నేనే ఎమ్మెల్యే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : హస్తం కల్పింస్తున్న ఆశలకు పోయి ఆగం కావొద్దని, ఆ పార్టీ సముద్రంలో నావలా మునిగిపోవడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండలంలోని కొర్విచెడ్ ఘని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు యువకులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలిపోయిన బెలూన్‌లా మారిందన్నారు. ఆ పార్టీ నడి సముద్రంలో నావలా మునిగిపోవడం ఖాయమన్నారు. వారు చూపిస్తున్న ఆశలకు పోయి ఆగం కావోద్దని, అందరు ఆలోచించాలన్నారు. ఎందుకంటే మళ్ళీ ఏర్పడేది బీఅర్ఎస్ ప్రభుత్వమే, తాండూరులో ఎమ్మెల్యేగా గెలిచేది నేనే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, బీఅర్ఎస్ నాయకులు హన్మంతు, శివ, మోతిరాం, తిరుపతి తదితరుల పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

