ఇంటర్ విద్యార్థులకు ఆల్‌దిబెస్ట్..!
– ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయండి
– ఎన్ఎస్‌యూఐ తాండూరు అధ్యక్షులు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన, అయోమయానికి గురికావద్దని.. విద్యార్థులు ఉత్సహాంగా పరీక్షలు రాయాలని ఎన్ఎస్‌యూఐ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ రెడ్డి సూచించారు. శుక్రవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఆల్‌దిబెస్ట్ చెప్పారు. ఇంటర్‌లో సిలబస్ కాలేదని, అప్పుడే పరీక్షలు రావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారని అన్నారు. అయినప్పటికి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలను భయంతో రాయొద్దని.. బాధ్యతగా రాయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు.. అసౌకర్యాలు కలిగితే తమను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు రాసే అన్ని పరీక్షలకు ఆల్‌దిబెస్ట్ తెలిపారు.

