తమ్ముళ్లే నా బలం.. బలగం..!
– ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలి
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పైలెట్‌కే మద్దతిస్తామంటూ యువత భరోసా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ తమ్ముళ్లే నా బలం, బలగం అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గ యువజన నాయకులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో చరిత్రలో ఎవ్వరు చేయని అభివృద్ధి, సంక్షేమాన్ని చేయడం జరిగిందన్నారు. గ్రామాలతో పాటు పట్టణ రూపు రేఖలు మార్చడం జరిగిందన్నారు. మళ్లీ ఎన్నికల్లో రాముడికి హనుమంతుడిలా యువత తనతో తోడుగా నడిస్తే తిరుగు ఉందందన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలన్నారు. 30 రోజులు కష్టపడి పనిచేస్తే ఐదేండ్లు మీకోసం పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ పనైపోయిందని, కర్ణాటకలో ప్రభుత్వం విఫలం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అదేవిధంగా యువత పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తామని తెలిపారు. భూజాలపై ఎత్తుకుని గెలిపించుకుంటామని భరోసా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు విజయ్ కుమార్, యువజన సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

