పైలెట్‌కే పట్టం ఖాయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కే పట్టం ఖాయం..!
– రోహిత్ రెడ్డికి టిక్కెట్‌ హర్షణీయం
– శుభకాంక్షులు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి పట్టం కట్టడం ఖాయమని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ నేతలు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టిక్కెట్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌కు చేరకుని చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్ తదితరులు ఆయన నివాసం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి టిక్కెట్టు సాధించుకున్న సందర్భంగా పుష్పగుచ్చం అందించి.. శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నెరవేర్చడమే కాకుండా అన్ని వర్గాల వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఏండ్లుగా చేయలేని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టడం కాయమన్నారు. ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!