కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వృధా చేసుకోవద్దు
– కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించండి
– ఎమ్మెల్యే సతీమణి ఆర్తీ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దానిని వృధా చేసుకోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 8వ వార్డు రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి తదితరులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ మెనిఫెస్టోను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ తోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వృధా చేసుకోవద్దన్నారు. తాండూరు అభిృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకోసం కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ శోభారాణి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్. కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, అశ్వని తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

