పైలెట్ కోసం కదలిసిన బీసీ దండు..!
– ఎన్నికల్లో సంపూర్ణ మద్దతివ్వాలని ప్రచారం
– తాండూరు మండలంలో జోరుగా ప్రచారం
– పాల్గొన్న బీసీ సంఘం జాతీయ కన్వీనర్ కె.రాజ్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం బీసీ సంక్షేమ సంఘం రంగంలోకి దిగింది. మంగళవారం తాండూరు మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. మంగళవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు మండలంలోని మల్కాపూర్, కోటబాస్పల్లి, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ తో పాటు బీసీ నేతలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరు రూ. 2 కోట్లతో 2 ఎకరాలలో బీసీ సమీకృత భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని వివరించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు అందించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు ఆర్సీ గౌడ్, గని కార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, హరి ప్రసాద్, రాము ముదిరాజ్, వెంకట్ బాబు, బీసీ సంఘం మండల అధ్యక్షులు బసంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

