పైలెట్ పెద్ద మనసు..!
– పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం
– ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని గెలిపించుకుందాం
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్ద మనసును ప్రదర్శిస్తున్నారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం ద్వారా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. సోమవారం తాండూరు పట్టణంలోని శివాజీ చౌరస్తా, మల్లప్ప మడిగతో పాటు ప్రధాన చౌరస్తాలో ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, తోపుడు బండ్ల వ్యాపారులతో పాటు ప్రజలను కలిసి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కమార్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీల పట్ల పెద్ద మనుసును చాటుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ నామినేట్ పదవుల్లో ఇప్పటికే బీసీ వర్గానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి, తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ పదవితో పాటు దేవాలయాల చైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులో బీసీల కోసం రూ.2 కోట్లతో 2 ఎకరాల్లో బీసీ సమీకృత భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారని అన్నారు. కావున ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్. మహిళ ప్రధాన కార్యదర్శి అనిత, మండలాల అధ్యక్షులు నరేందర్, బసంత్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజు, నాయకులు రాము ముదిరాజ్, టైలర్ రమేష్, ప్రవీణ్ గౌడ్, నరేష్. నర్సింలు, శోభన్, అనిల్ కుమార్, నవీన్, నరేందర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

