జనసేన మార్పు సాధ్యం
– తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు కృషి
– బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్ గౌడ్
– తాండూరు పట్టణంలో ఉత్సహాంగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : జనసేన పార్టీతో మార్పు తప్పక సాధ్యమవుతుందని బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా పట్టణంలోని పలువీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వినాయక చౌరస్తాలో ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఏండ్ల తరబడి పాలన చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తాండూరు ప్రాంతానికి ఒరిగిందేమి లేదన్నారు. తాండూరులో మార్పు రావాలంటే జనసేన పార్టీతో సాధ్యమవుతందన్నారు.
ప్రజలకు అవినీతి లేని పాలన అందిస్తామన్నారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు జాతీయ పార్టీ బీజేపీ సహాకారంతో సాధిస్తామని అన్నారు. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి జనసేన పార్టీ, బీజేపీ పార్టీలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, నాయకులు బాలి శివకుమార్, పటేల్ విజయ్ కుమార్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత. కౌన్సిలర్ సాహు శ్రీలత, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

