పార్కుల సుందరీకరణపై దృష్టి..!
– ప్రాపర్టీ టాక్సుల వసూళ్లకు కసరత్తు
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పార్కుల సుందరీకరణపై దృష్టిసారించడం పాటు ప్రాపర్టీ టాక్సుల వసూళ్లకు కసరత్తు చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరాజబాల్‌రెడ్డి అన్నారు.

గురువారం పట్టణంలోని శాంతినగర్‌లో పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు. పార్కు గోడలపై వేస్తున్న పేయింట్ విధానాన్ని తిలకించారు. పార్కులలో పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కమీషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి పట్టణంలోని పార్కులను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించారు.

అదేవిధంగా పట్టణంలోని ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేసేలా చూడాలని సూచించారు. అదేవిధంగా పట్టణ పారిశుద్ధ్యంలో భాగంగా ప్రతిరోజూ చెత్త డోర్ టూ డోర్ కలెక్షన్ అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగారం మల్లేశం, మున్సిపల్ జవాన్లు శ్రీను, అశోక్, సాయిప్రసాద్ తదితరులు ఉన్నారు.


