ముదిరాజ్‌లకు అండదండలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ముదిరాజ్‌లకు అండదండలు..!
– కులవృత్తులకు అధిక ప్రాధాన్యత
– 40 చెరువులను తవ్వించేందుకు కృషి
– త్వరలోనే పండుగళ్ల సాయన్న విగ్రహ ఏర్పాటు
– ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముదిరాజ్‌లకు అండ దండలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెల్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ముదిరాజ్ ల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిందన్నారు.

ముదిరాజ్ ల కుల వృత్తుల కోసం బడ్జెట్ లో రూ. 1200 కోట్లు కె టాయించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెరువులను తవ్వించారని, ప్రత్యేక వాహనాలను పంపిణీ చేశారని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ లు కీలకంగా ఉంటారని అన్నారు. తాండూరు గడ్డ ముదిరాజ్ లకు అడ్డగా నిలుస్తోందన్నారు. తాండూరులో ముదిరాజ్ ల కోసం ఎమ్మెల్యేగా 17 చెరువులను తవ్వించడం జరిగిందని, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే 40 చెరువులను తవ్వించేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఎక్కడా లేని విధంగా తాండూరులో 2 ఎకరాలలో రూ. 2 కోట్లతో బీసీ సమీకృత భవన్ ను నిర్మించుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో ముదిరాజ్ ల ఘనత కూడా ఉందన్నారు. ముదిరాజ్ లు కోరిన విధంగా తాండూరులో ముదిరాజ్ ల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని అన్నారు. అంతేకాకుండా తాండూరులో పండగుళ్ల సాయన్న విగ్రహాన్ని కూడా. ఏర్పాటు చేయిస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికి న్యాయం చేయలేదని, పేదలకు అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించుకుండా అమ్ముకున్నారని విమర్శించారు.

అదే తరహాలో తాండూరు టికెట్ ను ముక్కు మొహం తెలియని వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. తాండూరులో సేవ చేయని, మొక్క కూడా నాటని నేతకు గుణపాఠం. చెప్పారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే తాండూరులో ముదిరాజ్ లకు అండ దండలు అందిస్తానని అన్నారు. అంతకుముందు ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఎస్పీ రవీకాంత్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం సైకాలజిస్ట్ డా.లక్ష్మణ్ ఇచ్చిన ప్రసంగం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గోల్డ్ మెన్ హైదరాబాద్ లాలుపేట్ లల్లూ ముదిరాజ్, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్. బీఆర్ఎస్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, మాజీ కౌన్సిలర్ అనురాధ, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, ముదిరాజ్ సంఘం తాండూరు అధ్యక్షులు ఆకుల రాములు ముదిరాజ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్. ముదిరాజ్ సంఘం ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!