కాంగ్రెస్ అంటేనే దగా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ అంటేనే దగా..!
– హస్తం మెనిఫెస్టో జిమ్మిక్కే
– 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆరే రావాలి
– బీఆర్ఎస్ సంక్షేమానికి అందరు పట్టం కట్టాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరు మండలంలో ప్రజా ఆశీర్వాదయాత్ర
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా చేసే పార్టీ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం నారాయణపూర్, వీర్ శెట్టిపల్లి, బిజ్వార్, బొంకూర్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదయాత్ర చేపట్టారు. ఆయా గ్రామాల్లో కొనసాగిన యాత్రలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల ప్రజలతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారులో సీఎం కేసీఆర్ సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు సహాకారంతో తాండూరులో 30 ఏండ్లుగా చేయలేని అభివృద్ధిని చేయడం జరిగిందన్నారు. రూ.1670 కోట్లతో అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే తాండూరు నలువైలా నాలుగు లైన్ల రహదారులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలను నమ్మరాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో దరిద్రంగా మారిందన్నారు. అక్కడ ఐదు గ్యారెంటీలు అమలుకాలేక పోతున్నాయన్నారు. హస్తం పార్టీ మెనిఫెస్టో అధికారంలోకి రావాలని చేస్తున్న జిమ్మిక్కే అని విమర్శించారు. రైతులు, ప్రజలు కాంగ్రెస్ హామిలకు మోసపోయారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మితో దగా పడడం ఖాయమన్నారు. ఇప్పటికే 57 మంది ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జరిగాయన్నారు. వాళ్లకు అధికారం ఇస్తే తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఉండదన్నారు. రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. కాళేశ్వరం నీళ్లు రావాలన్నా, రైతులకు 24 గంటల విద్యుత్ అందాలన్నా మరోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలన్నారు. తాండూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారు.

ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని కొ నసాగించే బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొన్న ప్రజా ఆశీర్వాదయాత్రకు మంచి స్పందన లభించింది. మహిళలు, కార్యకర్తలు యాత్రలో రోహిత్ రెడ్డికి మంగళహారతులతో, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.

యాత్రలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డమ్మి ఈవీఎంలను ప్రదర్శిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి. మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పటేల్, ఉమాశంకర్, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!