ఆశీర్వాద సభకు అదిరే ఏర్పాట్లు
– కేసీఆర్ రాకతో పైలెట్ కు పట్టం
– కనీవీని ఎరుగని రీతిలో జనసమీకరణ
– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు అదిరిపోయే ఏర్పాట్లు చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే ఆశీర్వాద సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. సీఎంతో పాటు రాష్ట్ర గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారని చెప్పారు. పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నామన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా కనీవీని ఎరుగని రీతిలో సుమారు 75 వేల మందితో సభ నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగంతో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఎన్నికల్లో పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

