ప్రాధాన్యం లేని పార్టీలో ఉండలేం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రాధాన్యం లేని పార్టీలో ఉండలేం..!
– బీఆర్ఎస్‌లో చేరిన హేమంత్ కుమార్
– ఆహ్వానించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో పాటు నాయకులకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎస్పీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ మాజీ స్టేట్ జనరల్ సెక్రెటరీ హేమంత్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువా కప్పి హేమంత్ కుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఎనలేని సేవ చేసినప్పటికీ సరి అయిన ప్రాధాన్యం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానపరచడంలో ముందుంటుందన్నారని విమర్శించారు. తాండూరులో కష్టపడి పని చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ లో స్థానం లేదని స్థానం లేదని అలాంటి పార్టీలో ఉండడం ఇష్టం లేక నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు. అనునిత్యం తాండూరు అభివృద్ధికి పరితపించే వారి వెంట ఉండాలనే సదుద్దేశంతో నేడు గులాబీ కండువా కప్పుకోవడం జరిగిందన్నారు.‌ ఎన్నికల్లో ఆయనకు భారీ మెజార్టీ రావండం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, కార్మిక సంఘం నాయకులు విజయ్ కుమార్, నాయకులు విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!