– వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
– జెండాను ఎగురవేసిన గ్రంథాలయ చైర్మన్ మురళికృష్ణ గౌడ్
వికారాబాద్ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

జిల్లా గ్రంధాలయ సంస్థ ఆవరణలో సంస్థ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. పక్కనే ఉన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ స్థానిక నాయకులు గమనించడంతో వెంటనే జెండాను కిందకు దించి మళ్లి ఎగుర వేశారు. గతంలో కూడ జిల్లా గ్రంథాలయంలో జెండాను తలకిందులుగా ఎగుర వేయగా మళ్లి అదే సంఘటన జరుగడం పట్ల పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

