కర్ణాటక మద్యం సీజ్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కర్ణాటక మద్యం సీజ్
– ప్యాకెట్లు, బాటిళ్ల పట్టివేత
– ఓగిపూర్ వద్ద ఎక్సైజ్ పోలీసుల దాడులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన తాండూరు మండలంలోని ఓగిపూర్ వద్ద చోటు చేసుకుంది.

శుక్రవారం తాండూరు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్ర ఆదేశాల మేరకు తాండూరు మండలం ఓగిపూర్ గ్రామ శివారు వద్ద దాడులు చేపట్టినట్లు తెలిపారు. అయితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు చత్రసాల నుంచి ఓ వ్యక్తి కర్ణాటకకు చెందిన టెట్రా అనే మద్యం ప్యాకెట్లతో పాటు 12 బీరు బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఎక్సైజ్ పోలీసుల వాహనాన్ని గుర్తించిన నిందితుడు మద్యం, బాటిళ్లను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఎక్సైజ్ పోలీసులు వ్యక్తి నుంచి గుర్తించిన మద్యం ప్యాకెట్లు, బీరు సీసాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 22 వేలు ఉంటుందని అంచనా వేశారు.

నిందితుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం తరలించినట్లు అనుమానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ అనంతయ్య తెలిపారు. పరారిలో ఉన్న నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది భీమయ్య, కిషోర్, మహేష్‌, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!