సల్లంగా చూడు పోచమ్మ తల్లి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సల్లంగా చూడు పోచమ్మ తల్లి..!
– మల్‌రెడ్డిపల్లిలో బోనాల జాతర
– దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడూ పోచమ్మ తల్లీ అంటూ తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లి వాసులు అమ్మవారిని వేడుకున్నారు. ఆదివారం ఆషాడం సందర్భంగా అమ్మవారికి బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌తో పాటు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, కౌన్సిలర్ బాలప్ప, మాజీ కౌన్సిలర్ పరిమళ తదితరులు కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నేతలను కౌన్సిలర్ సాహు శ్రీలత శాలువాలతో సన్మానించారు. మరోవైపు అమ్మవారి జాతర సందర్భంగా మల్‌ రెడ్డిపల్లి ప్రజలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జాతర ఉత్సవాలతో మల్‌రెడ్డిపల్లి సందడిగా మారింది.

ఇదికూడా చదవండి…

కాలనీ రోడ్డు బాగు చేయించండి..!