పైలెట్ గెలుపు ఎప్పుడో ఖాయం

తాండూరు తెలంగాణ రాజకీయం హైదరాబాద్

పైలెట్ గెలుపు ఎప్పుడో ఖాయం
– పిలవకున్నా ఫ్రెండ్ కోసం వచ్చా
– రోహిత్ రెడ్డికి ఇచ్చే మెజార్టీ ఢిల్లీకి తాకాలే
– ఎమ్మెల్యేగా గెలిచాకా మళ్లీ వస్తా
– బైకు ర్యాలీలో హీరో మంచు మనోజ్ సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో రెండో సారి ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమని సినీ హీరో మంచు మనోజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సినీ హిరో మంచు మనోజ్ హాజరయ్యారు. పట్టణంలోని పురవీధుల్లో కొనసాగిన ర్యాలీలో మనోజ్ సందడి చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ రోహిత్ రెడ్డి తనకు ప్రియమిత్రుడని తెలుపుతూ తాండూరు అభివృద్ధి కోసం ఎంతో మంచి చేస్తున్నారని అన్నారు.

తాండూరును హైదరాబాద్ తర హాలో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పైలెట్ పిలవకున్నా తాండూరుకు వచ్చానని అన్నారు. అందుకే ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రెండోసారి ఎమ్మెల్యేగా రోహిత్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. తాండూరు ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి అందించే మెజార్టీ ఢిల్లీకి తాకాలన్నారు. స్వర్గీయులైన భూమా నాగిరెడ్డి. శోభా నాగిరెడ్డిల సొంత ఊరైన ఆళ్లగడ్డ, తిరుపతి నుంచి వచ్చిన చాలా మంది తాండూరులో సెటిల్ అయ్యారని, అందుకే తాండూరు ఇష్టమన్నారు.

ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డి గెలిచిన తరువాత మళ్లీ వస్తానని, అప్పుడు అంబేద్కర్, బీసీ భవనాలను ప్రారంభించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!