బీసీ సంఘం తాండూరు అధ్య‌క్షురాలుగా నాయికోడి జ్యోతి

తాండూరు వికారాబాద్

బీసీ సంఘం తాండూరు అధ్య‌క్షురాలుగా నాయికోడి జ్యోతి
– ఆర్‌.కృష్ణ‌య్య చేతుల మీదుగా నియామ‌క‌ప‌త్రం అంద‌జేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బీసీ సంఘం తాండూరు డివిజ‌న్ మ‌హిళ అధ్య‌క్షురాలుగా ప‌ట్ట‌ణానికి చెందిన నాయికోడి జ్యోతి నియామ‌క‌మ‌య్యారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని హోట‌ల్ సెంట్ర‌ల్‌లో బీసీల అఖిల‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. బీసీ సంఘం క‌న్విన‌ర్ కందుకూరి రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో నాయ‌కులు భారీగా త‌ర‌లివెళ్లారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన ఆర్.కృష్ణ‌య్య స‌మ‌క్షంలో రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో తాండూరు డివిజ‌న్ మ‌హిళ అధ్య‌క్షురాలుగా నాయికోడి జ్యోతిని ఎన్నుకున్నారు. అనంత‌రం జాతీయ అధ్య‌క్షులు ఆర్‌.కృష్ణ‌య్య జ్యోతికి నియామకం ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ బీసీ మ‌హిళ సామాజిక అభివృద్ధికి పాటుప‌డాల‌న్నారు. కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ బీసీ సంఘం ప‌టిష్ట‌త‌తో పాటు మ‌హిళ స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించాల‌ని సూచించారు. త్వ‌ర‌లోనే మ‌హిళ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, స‌య్య‌ద్ షుకూర్, తాండూరు బీసీ నాయకులు టైల‌ర్‌ రమేష్, అనిత రమేష్, గోట్టిగ‌ విజయలక్ష్మి, జయశ్రీ, జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.