తాండూరులో కాలుష్య పరీక్షలు..!
– ఆర్డీఎస్ యంత్రాలతో పోల్యూషన్ చెకప్
– పర్యవేక్షించిన పీసీబీ శాస్త్రవేత్త జీమోతా వాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కాలుష్య పరీక్షలు జరిపారు. తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పరీక్షలను చేపట్టారు. పీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జీమోతా వాహన ఆధ్వర్యంలో బృందం సభ్యులు గాలి కాలుష్యాన్ని నిర్ధారించే ఆర్డీఎస్(రెస్పీరేబుల్ డస్ట్ శ్యాంపేర్) యంత్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్టేషన్ మీద ఓ యంత్రం అమర్చగా.. పాత తాండూరు సమీపంలోని ఓ కాలనీలో మరో యంత్రాన్ని అమర్చారు. ప్రత్యేక కెమికల్స్ ను యంత్రాలలో కలిపి గాలి కాలుష్య పరీక్షలను ప్రారంభించారు.
ఈ యంత్రాలు గాలిలో నాణ్యతతో పాటు కాలుష్యాన్ని నిర్ధారిస్తాయని వారు తెలిపారు. 24 గంటల పాటు యంత్రాలను ఆన్ లో ఉంచి పరీక్షలు జరపడం జరుగుతుందని వెల్లడించారు. ఆ తరువాత కాలుష్యాన్ని గుర్తించి నివేధికను ఉన్నత అధికారులకు అందిస్తామని తెలిపారు. ప్రతి యేడాది సాధారణ పరీక్షలలో భాగంగా కాలుష్య పరీక్షలు జరుపడం జరుగుతుందని, ఇందులో భాగంగా తాండూరులో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు రాజేందర్, శ్రీనివాస్, విక్రమ్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి….

