తాండూరు టు పరిగి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు టు పరిగి..!
– స్ట్రాంగ్‌ రూంకు ఈవీఎంల తరుపు
– భద్రత మధ్య అభ్యర్థుల భవితవ్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం మిషన్లను అధికారులు పరిగికి తరలించారు. గురువారం తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో 269 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆయా పోలింగ్ కేంద్రాల కోసం 269 ఈవీఎం, వీవీ ప్యాడ్ మిషన్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనంగా 107 మిషన్లను అందుబాటులో ఉంచారు. గురువారం రాత్రి వరకు ఎన్నికల పోలింగ్ జరగడంతో ఈవీఎం, వీవీ ప్యాట్ లను తరలించేందుకు వీలు కాలేదు.

దీంతో శుక్రవారం తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో భారీ భద్రత మద్య పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్‌ నుంచి ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను తరలించారు. వికారాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్‌ను పరిగిలోని వ్యవసాయ మార్కెట్ కమిటి గోదాం ఏర్పాటు చేయడంతో తాండూరు నుంచి తరలించిన ఈవీఎంలను అక్కడి స్ట్రాంగ్ రూంకు తరలించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి సమక్షంలో వాటిని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. ఎల్లుండి 3న అసెంబ్లీ కౌటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!