రోడ్లు బాగుచేయాలంటూ విద్యార్థుల దర్నా
– కరణ్‌కోట్ వద్ద రాస్తారోకో
– భారీగా నిలిచిపోయిన వాహనాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాడైన రోడ్లను భాగుచేయాలని విద్యార్థులు దర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. ఈ సంఘటన గురువారం ఉదయం తాండూరు మండలం కరణ్‌కోట్ వద్ద చోటు చేసుకుంది. ఉదయం వేళ తాండూరుకు వచ్చే విద్యార్థులు కరణ్‌కోట్ వద్ద బస్సు నుంచి ఆందోళనకు దిగారు. కరణ్‌కోట్ మార్గంలోని తాండూరు వరకు రోడ్లను భాగుచేయాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంటకు పైగా రాస్తారోకో చేపట్టడంతో దారిపోడవున వాహనాల రాకపోకలు స్థంభించిపోయాయి. వివిధ పనులపై వెళ్లేవారు.. వచ్చేవారు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

