మాకు బస్సులోస్తలేవ్ మహాప్రభో..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మాకు బస్సులోస్తలేవ్ మహాప్రభో..!
– పట్టించుకోండి అని విద్యార్థుల ఆవేదన
– చీకటైనా కూడా రాని ఆర్టీసీ బస్సు
– జినుగుర్తి గేటు వద్ద చీకట్లో తండ్లాట
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రాత్రయినా కూడా మాకు బస్సులోస్తలేవూ మహాప్రభో.. అంటూ విద్యార్థులు ఆవేధన వ్యక్తం చేశారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు చీకటి పడే వరకు వేచి ఉండి తండ్లాటకు గురయ్యారు. రాత్రయినా బస్సు రాకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తి గేటు సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని జినుగుర్తి గేటు సమీపంలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎప్పటిలాగానే బుధవారం సాయంత్రం 4-45 నిమిషాలకు పాఠశాల వదిలేసింది.

బయటకు వచ్చిన విద్యార్థులు ఇంటికి వెళ్లే బస్సుకోసం ఎదురు చూశారు. గంటల పాటు వేచి చూసినా బస్సు రాలేదు. ఇంతలోనే చీకటి పడింది. సమయానికి బస్సు రాకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి బస్సు రాకపోవడంతో ఆవేధన వ్యక్తం చేశారు. ఇలా సమయ పాలన లేని బస్సుల రవాణా వల్ల చదువులకు ఆంటకం ఏర్పడుతుందని, రాత్రి 9 గంటల తరువాత ఇంటికి వెళితే ఏం చదువుకుంటామని ఆవేధన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులకు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించండి మహోప్రభో అంటూ వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!