ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు డా.రంజిత్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలతో పాటు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, తాండూరు పట్టణ పార్టీ అధ్యక్షులు అఫ్పూ(నయూం), తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్ యాదవ్, కోట్‌పల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు తదితరులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

