మన్నెగూడ జాతీయ రోడ్డు విస్తరణతో అభివృద్ధి
– రోడ్డు పనులకు పూర్తి సహాకారం అందిస్తాం
– అధికారుల చిన్నుచూపుతోనే జిల్లా వెనుకబాటు
– తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సాధన సమితి సభ్యులకు బీఎస్ఆర్ మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు అకాడమీ మన్నెగూడ జాతీయ రహదారి(ఎన్ హెచ్-163) విస్తరణతో జిల్లా ప్రజల అభివృద్ధి సాద్యపడుతుందని, రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసేలా తన వంతు సహాకారం అందిస్తానని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

గత 15రోజులుగా జాతీయ రోడ్డు విస్తరణ సాధన సమితి సభ్యులు హైదర్ షాకోట్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. చేవేళ్ల, వికారాబాద్, తాండూరు, కోడంగల్ నియోజకవర్గాలకు చెందిన సభ్యులు రోడ్డు విస్తరణ జరిగితే కలిసివచ్చే అభివృద్ధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. కొందరు పోలీసు అకాడమీ మన్నెగూడ జాతీయ రోడ్డు పనులు జరగకుండా ఎన్టీటీలో కేసులు వేసి.. పలు రకాలుగా ఆటంకాలు సృష్టించడం విచారకమరన్నారు. స్థానికేతరులతో పాటు ఇక్కడ పనిచేస్తున్న అధికారుల వల్ల పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణ ఎంతో అవసరమన్నారు. ఈ రోడ్డు విస్తరణ జరిగితే చేవేళ్ల, తాండూరు, వికారాబాద్, కోడంగల్ ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. మన్నెగూడ జాతీయ రహదారి విస్తరణకు తన వంతు సహాకారం అందిస్తానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి కన్వీనర్ కె.గోపాల్ రెడ్డి. మనోహర్ రెడ్డి, చంద్రప్రకాష్ రెడ్డి, డాక్టర్ జగన్ మోహన్, వెంకట్ రఘురాం, భీంరెడ్డి, వంశీ, నర్సింలు, జనార్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జయకృష్ణ, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీశైలం, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

