గవర్నర్ తమిళిసైతో బీఎంఆర్ భేటీ..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

గవర్నర్ తమిళిసైతో బీఎంఆర్ భేటీ..!
– మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి(బీఎంఆర్) భేటీ అయ్యారు. సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గవర్నర్ తమిళిసైని కలిసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులను కూడా కలిసి పుష్పగుచ్చాలను అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం