టోల్‌ ట్యాక్స్‌ చెల్లింపుల్లో మార్పులు

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

టోల్‌ ట్యాక్స్‌ చెల్లింపుల్లో మార్పులు
– కొత్త నిబంధనలు తీసుకవస్తున్న కేంద్రం
– ప్రత్యేక చట్టం ద్వారా శిక్ష వేసేలా చర్యలు
– వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
దర్శిని డెస్క్: హైవేలపై వసూలు చేసే టోల్ ట్యాక్స్‌ వ్యవస్థలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకవచ్చింది. ఈ కొత్త విధానంలో ప్రయాణికులకు మంచి ఉపయోగాలు ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం టోల్‌ రోడ్డులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 75 కిలోమీటర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, అయితే కొత్త విధానంలో ప్రయాణించే దూరానికి మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థలో ఎంతదూరం ప్రయాణిస్తే..అంతదూరానికే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతకేకాకుండా వచ్చే రోజుల్లో టోల్ ట్యాక్స్ వసూలుకు టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు. కొత్త నిబంధనలలో భాగంగా వాహనదారులు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తం నేరుగా మీ ఖాతా నుండి తీసివేయబడుతుందని తెలిపారు. ప్రత్యేక చర్యల తరువాత త్వరలోనే ఈ బిల్లును తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. టోల్ ట్యాక్స్ చెల్లించనందుకు ఎలాంటి శిక్ష విధించే నిబంధన లేదని చెప్పిన ఆయన టోల్ ట్యాక్స్‌కు సంబంధించిన బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక చట్టం ద్వారా టోల్‌ ట్యాక్సీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎన్‌హెచ్‌ఏఐ పరిస్థితి బాగానే ఉందని, దానికి డబ్బు కొరత లేదని ఆయన అన్నారు.