సాధికారితకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహిళా సాధికారతకు సావిత్రి బాయి పూలే నిలువెత్తు రూపంగా నిలుస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీసర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో సావిత్రి బాయి పూలే 193వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్ కుమార్ కందుకూరి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే మహిళ సాధికారతకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
సావిత్రిబాయి పూలే కృషి వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ప్రతి మహిళ సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. అప్పుడే ఆమెకు ఘనమైన నివాళి అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళ ఉపాధ్యాక్షురాలు అనిత, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్సు, యువనాయకులు ప్రవి ణ్, శివ. దత్తాత్రేయ, సాయి, ఎల్లప్ప, రఘు, దినేష్, మోచిరాజు, సమీర్, అన్నపూర్ణ, మనిషా, కవిత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

